1ఎం1బి జాతీయ యువ మార్పు తయారీదారుల రాష్ట్రపతి సదస్సుకు ఎంపికైన విద్యార్థులను రాజోలు ఎమ్మెల్యే దేవ వర ప్రసాద్ అభినందించారు. ఈ మేరకు గురువారం రాష్ట్రపతి సదస్సుకు ఎంపికైన విద్యార్థులు సాధిక, రోజలిన్ మల్లికార్జున్ మలికిపురం మండలం విశ్వేశ్వరాయపురంలో ఎమ్మెల్యే కార్యాలయం వద్ద ఎమ్మెల్యేని కలిశారు. రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్ గుండుబోగుల నరసింహారావు తదితరులు విద్యార్థులకు అభినందనలు తెలిపారు.