మలికిపురం మండలం లక్కవరం సెంటర్లో దెబ్బ తిన్న రక్షణ గోడను ఆదివారం రోడ్లు భవనాల శాఖ అధికారులు పునర్ నిర్మించారు. రక్షణ గోడ లేకపోవడంతో శుక్రవారం ఒక వ్యక్తి కాలువలో పడిపోయి తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై స్పందించిన అధికారులు దెబ్బతిన్న గోడ స్థానంలో కొత్త గోడను నిర్మించారు. దీనిపై లక్కవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు రుద్రరాజు గోపాలకృష్ణంరాజు హర్షం వ్యక్తం చేశారు.