త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి 17, 500 ఉద్యోగాలు స్కూల్ తెరిచేనాటికి ఇస్తామని మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు. మలికిపురం మండలం లక్కవరంలో ఉభయగోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికపై సమీక్ష సమావేశంలో ఆయన బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమి అభ్యర్థి రాజశేఖర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.