ఫిబ్రవరి నెలలో నిర్వహించే సఖినేటిపల్లి మండలంలోని అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి వారి కల్యాణోత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు అందరూ సమన్వయంతో పనిచేయాలని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ సూచించారు. అంతర్వేది దేవస్థానం వద్ద గురువారం జరిగిన కల్యాణోత్సవాల సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఉత్సవాలు సజావుగా సాగేందుకు అందరూ సహకరించాలని ఆయన కోరారు.