రాజోలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు పూర్వ విద్యార్థులు శుక్రవారం రూ. 51 వేలు అందించారు. 2004 - 2007 డిగ్రీ పూర్వ విద్యార్థులు ఈ మొత్తాన్ని కాలేజీ ప్రిన్సిపాల్ సాయిబాబాకు అందజేశారు. ఈ మొత్తంపై వచ్చే వడ్డీని డిగ్రీలో ప్రతిభ చూపిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహాలుగా అందించాలని ప్రిన్సిపాల్ ను కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, స్వామినాయుడు, మనేశ్వరరావు, త్రిమూర్తులు పాల్గొన్నారు.