సఖినేటిపల్లి: అనుమానాస్పద వ్యక్తుల సంచారంపై సమాచారం ఇవ్వాలి

85చూసినవారు
సఖినేటిపల్లి: అనుమానాస్పద వ్యక్తుల సంచారంపై సమాచారం ఇవ్వాలి
సఖినేటిపల్లి మండలం గొంది గ్రామంలో మెరైన్ పోలీసులు శనివారం రాత్రి పల్లెనిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై నాగార్జున మాట్లాడుతూ సముద్ర తీర ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తుంటే వెంటనే మెరైన్ పోలీసులకు తెలపాలని తెలిపారు. ఉగ్రవాదుల దాడులు నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామ సమస్యలను తెలుసుకుని ఉన్నత అధికారులకు నివేదికను పంపించారు.

సంబంధిత పోస్ట్