అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి కల్యాణ మహోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభమవుతాయని ఆలయ అసిస్టెంట్ కమీషనర్ వి. సత్యనారాయణ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన మాట్లాడుతూ.. పది రోజులపాటు ఉత్సవాలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఈ కళ్యాణ మహోత్సవాలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించి ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆయన కోరారు.