సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధి గాంచిన శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణ తీర్థ మహోత్సవాల పనులకు శనివారం శ్రీకారం చుట్టారు. ఉత్సవాల్లో ప్రత్యేకత ఉన్న రథోత్సవానికి సంబంధించిన రథానికి, స్వామివారు గ్రామోత్సవానికి ఉపయోగించే వాహనాల మరమ్మతులతో పనులు ప్రారంభించారు. ప్రత్యేక పూజలు చేసి రథాన్ని బయటకు తీశారు.