తుని పట్టణంలో కూటమి నాయకులు స్వచ్ఛంద సంఘాల ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ జరిగింది. శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ ర్యాలీలో ప్రభుత్వ విప్ యనమల దివ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆపరేషన్ సింధూరతో భారత సైన్యం ప్రపంచానికి తన సత్తా చాటిందని తెలిపారు. తీవ్రవాదులపై జరిగిన పోరులో విజయం సాధించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.