
తుని: ఏపీడబ్ల్యూజే జిల్లా కార్యదర్శిగా ప్రమాణ స్వీకారం చేసిన అర్జున్
ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా కార్యదర్శిగా తునికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ దేవరపు అర్జున్ ఆదివారం కాకినాడలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమం కాకినాడలోని ఏపీడబ్ల్యూజే కార్యాలయంలో జరిగింది. పెద్ద ఎత్తున జర్నలిస్టులు హాజరయ్యారు. కార్యదర్శి మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలపై అన్ని విధాల కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలిపారు. ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రముఖులు హాజరయ్యారు.