AP: వైసీపీలో పలు కీలక నియామకాలకు ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆమోదం తెలిపారు. ఈ క్రమంలో విజయసాయిరెడ్డి స్థానాన్ని కురసాల కన్నబాబును నియమించారు. ఇప్పటి నుంచి కన్నబాబు ఉత్తరాంధ్ర జిల్లా రీజినల్ కో– ఆర్డినేటర్‌గా వ్యవహరించనున్నారు. అలాగే కాకినాడ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా దాడిశెట్టి రాజాను నియమిస్తున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం తాజాగా వెల్లడించింది.