తెలంగాణలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరిగే బోనాల ఉత్సవాల్లో భాగంగా గోల్కొండ బోనాలు మొదలయ్యాయి. హైదరాబాద్‌లోని గోల్కొండ కోటలో జగదాంబ అమ్మవారికి తొలిబోనం సమర్పించారు. కాగా ఎమ్మెల్సీ కవిత ఈ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నారు. గోల్కొండ జగదాంబ అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. కాగా ఈ బోనాలు జులై 24 వరకు కొనసాగనున్నాయి. బోనాల జాతరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.20కోట్ల నిధులు కేటాయించిన విషయం తెలిసిందే.