ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆయన సతీమణి సునీత, కుటుంబ సభ్యులు న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటు వేశారు. పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది.