ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలో న్యూఢిల్లీ స్థానంలో పోరు మరింత రసవత్తరంగా మారింది. జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ 9 రౌండ్లు ముగిసే సమయానికి 1,170 ఓట్లు వెనకంజలోకి వచ్చారు. ఈ స్థానంలో బీజేపీ అభ్యర్థి పర్వేశ్ విజయం దిశగా దూసుకుపోతున్నారు. కాల్‌కాజీ స్థానంలో ఢిల్లీ సీఎం ఆతిశీ 3,231 ఓట్లు, షాకూర్ బస్తీలో ఆప్ అభ్యర్థి సత్యేంద్ర జైన్ 15,754 ఓట్ల వెనకంజలో ఉన్నారు.