AP: వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి కూటమి ప్రభుత్వంపై షాకింగ్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో ఎలాగో అభివృద్ధి చేయడం లేదని, వైసీపీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టే పనిలో బీజీగా ఉన్నారని ఆరోపించారు. స్కూళ్లు, ఆసుపత్రులను మీరు ఎలాగో రిపేర్లు చేయలేరని, కనీసం సెంట్రల్ జైళ్లనైనా మంచి కండిషన్‌లో పెట్టుకోవాలని తెలిపారు. భవిష్యత్తులో కూటమి నాయకులకు సెంట్రల్ జైలు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.