టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంది. పొలిట్ బ్యూరో సమావేశంలో సభ్యులంతా పద్మభూషణ్ అందుకున్న నందమూరి బాలకృష్ణకు అభినందనలు తెలిపారు. మూడు రోజుల పాటు మహానాడు నిర్వహించలాని పొలిట్ బ్యూరోలో నిర్ణయం తీసుకున్నారు. కడపలో సరైన సౌకర్యాలు లేకపోయినా అక్కడే మహానాడు నిర్వహించాలని నిర్ణయించినట్టు పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. పద్మభూషణ్ అందుకున్న బాలకృష్ణకు పొలిట్‌బ్యూరో అభినందనలు తెలిపింది..