AP: పింఛన్ల పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 2వ తేదీ ఆదివారం కావడంతో.. 1, 3వ తేదీల్లో పింఛన్లు పంపిణీ చేయనుంది. ఒకటో తేదీన పింఛన్లు తీసుకోని వారు 3న తీసుకోవచ్చు. ఈ విషయాన్ని పింఛన్‌దారులు గమనించాలని పేర్కొంది. మరోవైపు ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ల తనిఖీలు చేపట్టిన విషయం తెలిసింది. మెడికల్ కేటగిరీ, దివ్యాంగుల కేటగిరీలో పింఛన్‌లను అందుకుంటున్న వారిలో అనర్హులను గుర్తించే పనిలో ఉంది.