AP: వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన భారతి సిమెంట్స్ పూర్తి కాలపు డైరెక్టర్ గోవిందప్ప బాలాజీని సిట్ అధికారులు ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. గోవిందప్ప బాలాజీ రిమాండ్ రిపోర్ట్‌లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. లిక్కర్ సిండికేట్‌లో గోవిందప్పను సీఐడీ అధికారులు సభ్యుడిగా పేర్కొన్నారు. ఈ కేసులో ఏ1 రాజ్ కసిరెడ్డికి గోవిందప్ప సన్నిహితుడని, ముడుపుల వసూలు చేసే వ్యవహారంలో గోవిందప్ప కీలకంగా ఉన్నట్లు సమాచారం.