AP: టీడీపీ మహానాడు ఏర్పాట్లపై కడపలో ఆదివారం కీలక సమీక్ష నిర్వహించనున్నారు. ఈ నెల 27 నుంచి మూడు రోజుల పాటు సాగే ఈ కార్యక్రమానికి సంబంధించి పబ్బాపురం గ్రామంలోని మహానాడు ప్రాంగణంలో ఈ భేటీ జరగనుంది. ఆయా పనులపై సమీక్షించి నిర్ణయాలు తీసుకోనున్నారు. 125 ఎకరాల విస్తీర్ణంలో బహిరంగ సభ, ప్రతినిధుల సమావేశాలకు వేర్వేరుగా వేదికల నిర్మాణ పనులు చేపట్టారు. ఈ పనులను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పర్యవేక్షిస్తున్నారు.