ఏపీలో మెట్రో రైలు ప్రాజెక్టులపై కీలక ముందడుగు పడింది. పలు విదేశీ బ్యాంకుల ప్రతినిధులతో మెట్రో రైలు కార్పొరేషన్ ఎండీ రామకృష్ణారెడ్డి భేటీ అయ్యారు. వీరంతా విజయవాడలో ప్రతిపాదిత మెట్రో కారిడార్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో విశాఖ మెట్రోకు రూ.6,100 కోట్లు, విజయవాడ మెట్రోకు రూ.5,900 కోట్ల రుణం సమీకరించాలని నిర్ణయించారు. త్వరలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో విదేశీ బ్యాంకుల ప్రతినిధులు చర్చించనున్నారు.