రాజమండ్రి జిల్లా దవళేశ్వరంలో ఇద్దరు బాలికలు కిడ్నాప్‌కు గురయ్యారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒడిశా బరంపురానికి చెందిన సునీత కుటుంబం కొన్నేళ్లుగా దవళేశ్వరంలో నివాసం ఉంటోంది. గత నెల 22న వెంకటేష్ అనే యువకుడు సునీతతో తాను రైల్వే టీసీ అని చెప్పి బాలికలను తన వెంట తీసుకెళ్లాడని బాధిత తల్లి ఆరోపించింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపుతోంది.