యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాకు భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నాంగ్యేల్ వాంగ్‌చుక్ మంగళవారం పాల్గొన్నారు. త్రివేణి సంగమంలో పవిత్రస్నానం చేసి, గంగాహారతి తీసుకున్నారు. ఆయనతో పాటు సీఎం యోగి ఆదిత్యనాథ్ హాజరయ్యారు. ఇరుదేశాలకు చెందిన పలువురు ప్రముఖులు, భక్తులు గంగాహారతి, పూజా కార్యక్రమాల్లో ఉన్నారు. ఆయనకు చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో యోగి ఆదిత్యనాథ్ సాదర స్వాగతం పలికారు.