AP: గాలిపటం ఎగరవేత రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. తిరుపతి జిల్లా చంద్రగిరి పట్టణంలో సమీర్ (12) అనే బాలుడు మరో బాలుడితో కలిసి గాలిపటం ఎగరవేస్తున్నారు. ఈ క్రమంలో ఓ బాలుడికి కిందపడి గాయాలు కావడంతో సమీర్‌పై మేనమామ షబ్బీర్ కోపంతో గదిలో పెట్టి తాళం వేశాడు. తిరిగి వచ్చి కొడుతాడన్న భయంతో సమీర్ ఉరేసుకుని సూసైడ్డ చేసుకున్నాడు. మరోవైపు మదనపల్లెలో గాలిపటం ఎగరవేస్తున్న సమయంలో కరెంట్ షాక్ కొట్టడంతో మరో బాలుడు మృతి చెందాడు.