AP: రేషన్ మాఫియా కేసులో పేర్ని నాని కుటుంబ సభ్యులకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే పేర్ని వ్యవహారంలో కొడాలి నాని పాత్ర ఉందన్న సమాచారం మేరకు ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని తెలుస్తోంది. పేర్ని ద్వారానే కొడాలి నాని పాత్రను వెలుగులోకి తీసుకువచ్చి.. చర్యలు తీసుకునేలా వ్యూహాత్మకంగా అడుగులు పడుతున్నాయని రాజకీయ నిపుణులు అంటున్నారు. సర్కార్ పేర్ని నాని, కొడాలి నానిని వదిలేలా కనిపించడం లేదని తెలుస్తోంది.