విరాట్ కోహ్లీ టెస్ట్ మ్యాచ్‌లకు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా దానిపై రవిశాస్త్రి మాట్లాడుతూ.. కోహ్లీ మానసికంగా అలసిపోయాడని అన్నారు. రిటైర్మెంట్ ప్రకటించే వారం ముందు కోహ్లీ తనతో మాట్లాడినట్లు రవిశాస్త్రి చెప్పారు. కోహ్లీలో ఎలాంటి విచారం లేదని, ఆటకు ఇవ్వగలిగినంత ఇచ్చానన్న స్పష్టతతో అతడు ఉన్నాడని పేర్కొన్నారు. కోహ్లీ శారీరకంగా ఫిట్‌గా ఉన్నా.. మానసికంగా బాగా అలసిపోయాడని వ్యాఖ్యానించారు.