AP: వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం తనను అరెస్టు చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని ఆరోపించారు. మోకా భాస్కరరావు మర్డర్ కేసులో కొల్లు రవీంద్ర అరెస్టు కావడంతో తనపై కక్ష కట్టారంటూ పేర్కొన్నారు. దీంతో తనను అరెస్టు చేయడమే కొల్లు రవీంద్ర లక్ష్యమని, చట్టపరంగా పోరాడుతామని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తనను వేధించడానికి చేయని ప్రయత్నం లేదంటూ వ్యాఖ్యానించారు.