ఉప్పలగుప్తం మండలం భట్టుపాలెంకు చెందిన 15 సంవత్సరాల బాలిక కడుపునొప్పితో బాధపడుతుంటే ఆమె తల్లిదండ్రులు అమలాపురంలోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. బాలికకు వింత అలవాటు ఉండటంతో రహస్యంగా గత మూడేళ్లుగా తన జుట్టు తానే తింటుందని డాక్టర్ గంధం విశ్వనాథ్ శుక్రవారం తెలిపారు. ఆమె పొట్టలో జుట్టు ఉన్నట్లు స్కానింగ్ ద్వారా గుర్తించి వెంటనే సర్జరీ చేసి కడుపులో ఉన్న 1. 5 కేజీల జుట్టును తొలగించామన్నారు.