అమలాపురం: పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే రోగాలు దరి చేరవు

83చూసినవారు
అమలాపురం: పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే రోగాలు దరి చేరవు
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే రోగాలు దరి చేరవని పేరూరు గ్రామ సర్పంచ్ దాసరి అరుణా డేవిడ్ అన్నారు. అమలాపురం మండలం పేరూరు గ్రామంలో స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమె పాల్గొని రోడ్డు ప్రక్కన మొక్కలు నాటారు. అనంతరం చలివేంద్రం ఏర్పాటు చేసి ఉపాధి శ్రామికులకు దాహాన్ని తీర్చారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు, గ్రామస్తులు, నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్