అమలాపురం మండలం బండారులంక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు ఆశా డే మరియు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా మత్తు పదార్థాల విమోచన కేంద్రం సిబ్బందిచే అవగాహన కార్యక్రమం మంగళవారం నిర్వహించడం జరిగింది. డి అడిక్షన్ సెంటర్ మేనేజర్ శ్రీనుబాబు మాట్లాడుతూ నేటి సమాజంలో మద్యం, గంజాయి, నికోటిన్, నల్లమందు, గుడుంబా వంటి మత్తు పదార్థాలకు యువత ఎక్కువగా బానిస అవుతూ. క్యాన్సర్ వంటి భయంకరమైన వ్యాధులకు గురవుతున్నారని వివరించారు.