ఆగస్టు 31 వరకు గ్రామాల్లో అవగాహన

74చూసినవారు
ఆగస్టు 31 వరకు గ్రామాల్లో అవగాహన
జూలై 1 నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు వైద్యారోగ్య శాఖ ద్వారా డయేరియా వ్యాధి నివారణపై అవగాహన కల్పించనున్నట్లు ఎంపీడీవో కృష్ణమోహన్ శనివారం తెలిపారు. విద్య, వైద్య, పంచాయతీ, ఐసీడీఎస్ శాఖల సమన్వయంతో గ్రామాల్లో అవగాహన కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ సుమ, డా. శాంతిప్రియ, ఈవోఆర్డీ సత్యనారాయణ, ఐసీడీఎస్ సూపర్‌వైజర్, వైద్యసిబ్బంది పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్