
డ్వాక్రా మహిళలకు రాయితీపై షేడ్ నెట్స్: మంత్రి కొండపల్లి
AP: ఉద్యానసాగును ప్రోత్సహించేందుకు 2025-26లో 5 వేల మంది డ్వాక్రా మహిళలకు 50 శాతం రాయితీతో షేడ్ నెట్స్ను అందిస్తామని సెర్చ్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఒక్కో షేడ్ నెట్ వ్యయం రూ.3.22 లక్షలు కాగా, అందులో 50 శాతం రాయితీని ఉద్యానశాఖ ద్వారా అందిస్తామని, మిగతా మొత్తాన్ని ఉన్నతి, స్త్రీనిధి, బ్యాంకు లింకేజీ ద్వారా రుణం ఇప్పిస్తామన్నారు. మార్చిలో 260 మందికి వీటిని పంపిణీ చేయనున్నట్లు చెప్పారు.