అనపర్తి: వెలగల శీనుకు ఘనసత్కారం

63చూసినవారు
అనపర్తి: వెలగల శీనుకు ఘనసత్కారం
కొంకుదురు గ్రామంలో అన్నయజ్ఞం పేరుతో జరుగుతున్న అనుదిన అన్నదాన కార్యక్రమం గత ఏడు సంవత్సరాలుగా అనాధలకు, రోగులకు, దివ్యాంగులకు ప్రతిరోజూ భోజనం అందిస్తుంది. కొంకుదురు గ్రామంలో జరుగుతున్న ఈ అన్నయజ్ఞం కార్యక్రమానికి కొంకుదురుతో పాటు ఇతర ప్రాంతాలలో, విదేశాలలో ఉన్న దాతలు కూడా సహకరిస్తారు. ఈ అన్నయజ్ఞంలో భాగంగా అత్యద్భుతంగా నిర్వహించిన శ్రీ వెలగల శ్రీనివాసరెడ్డికి అన్నయజ్ఞం దాతలు అందరూ ఆదివారం సత్కారం అందించారు.

సంబంధిత పోస్ట్