మే 21- మే 24 వరకు అనపర్తి మండలం రామవరంలో శ్రీ నల్లమిల్లి సుబ్బిరెడ్డి కళామందిరంలో నల్లమిల్లి మూలారెడ్డి నాటక పరిషత్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి సాంఘిక నాటికల పోటీలు నిర్వహించనున్నారు. పోటీలకు ముఖ్య అతిధిగా హాజరుకావాలని హైదరాబాద్ లో మహా గ్రూప్స్ చైర్మన్ & ఎండీ మారెళ్ళ వంశీకృష్ణకి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆహ్వానం పత్రికను అందజేశారు.