వైసీపీ బలోపేతానికి కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి అన్నారు. అనపర్తి వైసీపీ కార్యాలయంలో నూతనంగా నియమితులైన వైసీపీ అనుబంధ విభాగాల జిల్లా అధ్యక్షులను గురువారం మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి సత్కరించారు. సమర్థవంతంగా పని చేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు.