విద్యార్థులకు వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 5న వైసీపీ తలపెట్టిన ఫీజు పోరు కార్యక్రమాన్ని పార్టీ నిర్ణయం ప్రకారం మార్చి 12కి వాయిదా వేసినట్లు వైసీపీ అయినవిల్లి గ్రామ అధ్యక్షుడు విద్యాసాగర్ తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన మాట్లాడుతూ ఫీజు పోరు కార్యక్రమానికి అనుమతులు అడిగిన ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు. వైసీపీ శ్రేణులు గమనించాలన్నారు.