అయినవిల్లి మండలంలో పలు గ్రామాలలో శనివారం మధ్యాహ్నం స్వల్ప వర్షం కురిసింది. ఉదయం నుంచి అధిక ఉష్ణోగ్రతలతో ఉక్కపోత తో ఉన్న వాతావరణం మధ్యాహ్నం నుంచి మేఘావృతమై చిరు జల్లులు కురిసింది. భారీ వర్షం గానీ కురుస్తాదేమో అని రైతులు ధాన్యం మీద బరకాలు కప్పుతున్నారు. అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.