రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ నేటి పర్యటన వివరాలు ఆయన కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. నేడు ఉదయం 9.30 గంటలకు రామచంద్రపురం రూరల్ మండలం ద్రాక్షారామంలో వివిధ రోడ్లు శంకుస్థాపనలో పాల్గొంటారు. ఉదయం 11 గంటలకు కాకినాడ కోరమండల్ ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీ యాజమాన్యం, కార్మికులకు ఉద్దేశించిన భద్రత అవగాహన కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు.