మామిడికుదురు మండలం అప్పనపల్లి శ్రీబాల బాలాజీ స్వామి వారికి శనివారం రూ. 1, 84, 745 ఆదాయం లభించింది. స్వామి వారిని 3289 మంది భక్తులు దర్శించుకోగా, 2316 మంది స్వామి వారి అన్న ప్రసాదం స్వీకరించారు. నిత్య అన్నదానం ట్రస్ట్ కు భక్తులు రూ. 48, 671 విరాళంగా సమర్పించారని ఆలయ ఈవో సత్యనారాయణరాజు తెలిపారు. భారీ సంఖ్యలో భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు.