మామిడికుదురు మండలం వ్యాప్తంగా గురువారం సాయంత్రం అకాల వర్షం కురిసింది. దీంతో కళ్లాల్లో ఉన్న ధాన్యం చుట్టూ వర్షం నీరు చేరిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ సకాలంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. మామిడికుదురు మండలంలో 2,768 ఎకరాల్లో వరి పండించారు. ఎకరానికి 35 క్వింటాళ్లు దిగుబడి వచ్చింది. 50 శాతం ధాన్యాన్ని మాత్రమే ఇంతవరకు కొనుగోలు చేశారన్నారు.