మామిడికుదురులో వైద్య సిబ్బంది ర్యాలీ

82చూసినవారు
ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని మామిడికుదురు మండలం నగరంలో మంగళవారం ర్యాలీ నిర్వహించారు. పీహెచ్సీ నుంచి ర్యాలీ ప్రారంభమైంది. క్యాన్సర్ పై విజయం స్క్రీనింగ్ తోనే సాధ్యమని ఉద్యోగులు నినాదాలు చేశారు. ఆరోగ్య కరమైన జీవన శైలి ద్వారా క్యాన్సర్ నివారించవచ్చని అన్నారు. క్యాన్సర్ నివారణకు ముందస్తుగా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రభుత్వ వైద్య సేవలను వినియోగించుకోవాలని వైద్యులు కోరారు.

సంబంధిత పోస్ట్