ఎస్సీ కులగణనలో బుడగ జంగం జనాభాను కూడా లెక్కించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ సంఘం నేతలు శనివారం మామిడికుదురు తహసీల్దార్ ఆచార్యులకు వినతిపత్రం ఇచ్చారు. ఎస్సీ వర్గీకరణ కమిషన్ విచారణలో ఎస్సీ ఉప కులాలకు ఆన్లైన్ జాబితాలో తమ కులం ప్రస్తావన లేదన్నారు. దీనివల్ల తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వాపోయారు. దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేయాలని మండల శాఖ అధ్యక్షులు త్రిమూర్తులు కోరారు.