పి. గన్నవరం: మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

59చూసినవారు
విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ద్వారా నాణ్య మైన పోషకాహారాన్ని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పి. గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అన్నారు. ఆయన పి. గన్నవరం ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద నూతనంగా ఏర్పాటుచేసిన మధ్యాహ్న భోజన పథకాన్ని శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ ఛైర్మన్ నామన రాంబాబు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని ఎమ్మెల్యేతో కలిసి విద్యార్థులకు భోజనాలను వడ్డించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్