పిఠాపురం మండలం చిత్రాడలో శుక్రవారం జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్వహించే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు పి. గన్నవరం నియోజకవర్గం నుండి జనసేన నాయకులు, కార్యకర్తలు అభిమానులు వేలాదిగా తరలిరావాలని ఎమ్మెల్యే గిడ్డి సత్య నారాయణ పిలుపునిచ్చారు. ఆయన పి. గన్నవరంలో గురువారం మీడియాతో మాట్లాడారు. విజయవంతంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను నిర్వహించాలని సూచించారు.