మామిడికుదురు మండల పరిధిలో శుక్రవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని అమలాపురం ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రవికుమార్ గురువారం తెలిపారు. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు 11కేవీ లైన్ లో ట్రీ కటింగ్ కోసం ఈదరాడ, కొమరాడ, లూటుకుర్రు, మాకనపాలెం, ఆదుర్రు గ్రామాలకు కరెంటు సరఫరా నిలిపివేస్తామన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.