రామచంద్రపురం: స్వచ్ఛత కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సుభాష్

52చూసినవారు
రామచంద్రపురం: స్వచ్ఛత కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సుభాష్
రామచంద్రపురంలో స్వచ్ఛత మరియు ఆరోగ్యం కోసం "స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర" కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొని మాట్లాడుతూ మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు. వేసవిలో ఆరోగ్యం కాపాడుకోవడానికి బీట్ ది హీట్" సూచనలు కూడా అందించారు. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘం కమీషనర్, కార్యాలయం సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్