మామిడికుదురు మండలం పాశర్లపూడిలో శనివారం భారీగా ట్రాఫిక్ స్తంభించింది. కొండాలమ్మ చింత సెంటర్లో జాతీయ రహదారిపై రెండు గంటలు వాహనాలు నిలిచి పోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అంతర్వేది కల్యాణోత్సవాలకు భారీ ఎత్తున భక్తులు తరలి వెళ్తున్నారు. శుక్రవారం రాత్రి కల్యాణానికి వెళ్లిన భక్తులు తిరిగి స్వస్థలాలకు వస్తున్నారు. రథోత్సవానికి భక్తులు విశేషంగా వెళ్తున్నారు. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి.