ఎమ్మెల్సీ అభ్యర్థి గెలవాలని అయినవిల్లిలో పూజలు

71చూసినవారు
ఎమ్మెల్సీ అభ్యర్థి గెలవాలని అయినవిల్లిలో పూజలు
గోదావరి జిల్లాల ఎన్డీయే కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించడంలో దళితులు క్రియాశీలకంగా వ్యవహరించాలని టీడీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పొద్దోకు నారాయణ రావు కోరారు. ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించారు. ముందుగా అయినవిల్లి విఘ్నేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. పలువురు కూటమి నేతలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్