మామిడికుదురు మండలంలోని అప్పనపల్లి శ్రీబాల బాలాజీ స్వామిని
టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు సతీమణి విజయలక్ష్మి కుటుంబ సభ్యులతో కలిసి శనివారం దర్శించుకున్నారు. ఈ మేరకు వారికి ఆలయ మర్యాదలతో అర్చకులు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేదాశీర్వచనం అందించారు. ఈవో గ్రంధి మాధవి స్వామి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు.
టీడీపీ మండలాధ్యక్షుడు శ్రీనివాస్, పార్టీ నేతలు పాల్గొన్నారు.