రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని దేవరపల్లి మండలంలోని బంధపురం గ్రామంలో ఉన్న కోదండ రామాలయాన్ని కొవ్వూరి ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన స్వామి వారిని సతీ సమేతంగా దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ఆశీస్సులతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.