గౌరీపట్నం పి. హెచ్. సి. నందు వైద్యాధికారి డాక్టర్ జె. సతీష్ ఆధ్వర్యంలో శుక్రవారం జాతీయ డెంగ్యూ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా గౌరీపట్నం గ్రామాలలో ర్యాలీ నిర్వహించి ప్రజలతో డెంగ్యూ నివారణ నిమిత్తం ప్రతిజ్ఞ చేయించారు. డాక్టర్ మాట్లాడుతూ. డెంగ్యూ వ్యాధి ఎడిస్ ఈజిప్టి టైగర్ దోమ వల్ల వస్తుందని. ఈ దోమలు ఇంటి లోపల ఆవరణలో ఉంటాయని పగటిపూట కుడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏ శ్రీకృష్ణుడు తదితరులు పాల్గొన్నారు.